Sunil Chhetri : మరో అరుదైన రికార్డు సృష్టించిన సునీల్ ఛెత్రీ

-

ఇండియన్ ఫుట్‌బాల్‌ స్టార్‌, భారత జట్టు కెప్టెన్‌ సునీల్ ఛెత్రి మరో అరుదైన రికార్డు సాధించాడు. ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో భాగంగా మంగళవారం కిర్గిజ్‌ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్‌ కొట్టడం ద్వారా సునీల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌లో 85వ గోల్‌ నమోదు చేశాడు.

హంగేరీకి చెందిన ఫెరెన్క్‌ ఫుకాస్‌(85 మ్యాచ్‌ల్లో 84 గోల్స్‌)ను అధిగమించి టాప్‌-5లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 133 మ్యాచ్‌లాడిన సునీల్‌ ఛెత్రి 85 గోల్స్‌ నమోదు చేశాడు. ఇక తొలి స్థానంలో క్రిస్టియానో రొనాల్డో- పోర్చుగల్‌(198 మ్యాచ్‌ల్లో 122 గోల్స్‌) ఉండగా.. రెండో స్థానంలో అలీ దాయి- ఇరాన్‌(148 మ్యాచ్‌ల్లో 109 గోల్స్‌), మెస్సీ-అర్జెంటీనా (99 గోల్స్) మూడో స్థానంలో, మొక్తర్‌ దహారి- మలేసియా (142 మ్యాచ్‌ల్లో 89 గోల్స్‌) నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ముక్కోణపు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు విజేతగా నిలిచింది. మణిపుర్‌లో మంగళవారం జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–0 గోల్స్‌ తేడాతో కిర్గిజ్‌ రిపబ్లిక్‌ జట్టుపై గెలిచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news