భారతీయ రైల్వే కొత్త పథకం…పూర్తి వివరాలు మీకోసం..!

-

భారత దేశం లోని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ కొత్త స్కీమ్ ని తీసుకు వచ్చింది. అమృత్ భారత్ అనే కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే…. దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు సహాయమిస్తుంది. ఇది 1,000 పైగా రైల్వే స్టేషన్లకు సదుపాయాలని అందించనుంది. రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రెడీ చేసింది.

ఇక పూర్తి వివరాలని చూస్తే… స్టేషన్‌లో రూఫ్ ప్లాజా ని సిటీ సెంటర్‌ను తీసుకు రావడమే వారి లక్ష్యం. అలానే నాణ్యమైన సౌకర్యాలను ప్రవేశపెట్టడం కోసం కూడా చూస్తోంది. వివిధ రకాల వెయిటింగ్ రూమ్‌లు, మెరుగైన ఫలహారశాల వంటివి కూడా తీసుకు రావాలని చూస్తున్నారు.

అలానే పార్కింగ్, మంచి లైటింగ్, అవాంఛిత నిర్మాణాల తొలగింపు, రోడ్ల విస్తరణ, ప్రత్యేక నడక మార్గాలు ఇంటివి అన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా తీసుకు రానున్నారు. ప్రతి రైల్వే స్టేషన్‌లో దాదాపు 600 మీటర్ల పొడవున ప్లాట్‌ఫారమ్‌ ఉండేలా చేయనున్నారు. అలానే స్టేషన్‌లో డ్రైనేజీ వ్యవస్థపై కూడా దృష్టి పెడతారట.

అదే విధంగా ఈ మాస్టర్ ప్లాన్‌ లో Wi-Fi యాక్సెస్ సదుపాయం ని కూడా కల్పించనున్నారు. 5G టవర్‌లను ఏర్పాటు చేయడానికి చూస్తారట. అలానే కొత్త ఫర్నిచర్ ని కూడా పెట్టనున్నారు. దివ్యంగులకి టాయిలెట్లు వంటి సౌకర్యాలు రైల్వే స్టేషన్‌లో ఉండేలా చూడబోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news