ఉన్నత చదువుల కోసం కెనాడాకు వెళ్లి.. ప్రమాదంలో మృతి

-

ఉన్నత చదువుల కోసం కెనాడాకు వెళితే.. అక్కడ ప్రమాదంలో మృతి చెందాడు భారతీయ విద్యార్థి. మరణించిన విద్యార్థి పేరు కార్తీక్ సైనీ. 2021 ఆగస్టులో కెనడా వచ్చాడు. 20 ఏళ్ల సైనీ కెనడాలోని షెరిడియన్ కాలేజీలో చదువుతున్నాడు. కాగా, టొరంటో నగరంలో సైకిల్ పై వెళుతుండగా, ఓ రోడ్డు దాటే యత్నంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు సైకిల్ తో పాటు కార్తీక్ సైనీని కూడా ఈడ్చుకుపోయింది. దాంతో అక్కడిక్కడే మరణించినట్టు తెలుస్తోంది.

Hyderabad: Intermediate student dies in accident

గత బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఘటనతో హర్యానాలోని కర్నాల్ లో కార్తీక్ సైనీ కుటుంబంలో విషాదం నెలకొంది. దీనిపై కార్తీక్ సైనీ బంధువు ప్రవీణ్ సైనీ స్పందిస్తూ, వీలైనంత త్వరలో కార్తీక్ మృతదేహం కెనడా నుంచి భారత్ చేరుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టొరంటో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news