Breaking : బైంసాలో బండి యాత్రకు బ్రేక్‌..

-

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే 4 విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించారు. అయితే.. తాగాజా బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి ప్రారంభంకానుంది. అయితే.. రేపటి నుంచి బైంసాలో మొదలుకానున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. బైంసా సున్నితమైన ప్రాంతం కాబట్టి యాత్రతో పాటు.. బహిరంగసభకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. అయితే పాదయాత్ర కోసం బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి బైంసా బయలుదేరారు. రేపు జరిగే సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ నేతలు.

Cases filed against Bandi Sanjay over hate speech

చివరి నిమిషంలో పర్మిషన్ లేదని చెప్పడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, భైంసా నుండి కరీంనగర్ వరకు 20 రోజుల పాటు 222 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మొత్తం 5 జిల్లాలు, 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కొనసాగనుంది. డిసెంబర్ 17న కరీంనగర్ జిల్లాలో ఈ యాత్ర ముగియనుంది. ఐదో విడతలో జరిగే ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభ సభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news