భారత్ మరో ముందడుగు.. మంకీపాక్స్ నిర్ధారణకు స్వదేశీ కిట్!

భారతదేశంలో ఇప్పటివరకు 10 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో మంకీపాక్స్ నిర్ధారణ పరీక్షకు మొట్టమొదటి స్వదేశీ ఆర్టీ పీసీఆర్ కిట్‌ను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని మెడ్‌టెక్ జోన్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ దీన్ని ప్రారంభించారు. ఈ కిట్‌ను ట్రాన్స్ ఏషియా బయో మెడికల్స్ అభివృద్ధి చేసింది.

మంకీపాక్స్
మంకీపాక్స్

ఈ సందర్భంగా ట్రాన్స్ ఏషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సురేశ్ వజిరాణి మాట్లాడుతూ.. ‘ఈ కిట్ సాయంతో మంకీపాక్స్ లక్షణాలను ముందుగానే గుర్తించవచ్చు. ట్రాన్స్ ఏషియా ఎర్బా మంకీపాక్స్ ఆర్టీ పీసీఆర్ కిట్ ద్వారా సులభంగా పరీక్షలు చేసుకోవచ్చు. మంకీపాక్స్‌కు గురైన వ్యక్తులలో యాంటీబాడీస్ ఉనికిని తనిఖీ చేయవచ్చు. మంకీపాక్స్ లక్షణాలను ఈ కిట్ సాయంతో సులభంగా తెలుసుకోవచ్చని సురేశ్ వజిరాని పేర్కొన్నారు.