త‌క్కువ ధ‌ర‌కే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్‌..!

-

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ 4 ప్ల‌స్‌ను భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో 6.82 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరాతోపాటు మ‌రో డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ వెనుక‌వైపు ఉంది. డ్యుయ‌ల్ సిమ్‌, మెమొరీ కార్డుల కోసం 3 ప్ర‌త్యేక స్లాట్ల‌ను ఇచ్చారు. 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీ ఇందులో ఉంది.

Infinix Smart 4 Plus smart phone launched in India

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్ల‌స్ స్పెసిఫికేష‌న్లు…

* 6.82 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1640 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ25 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్
* 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
* 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డీటీఎస్ హెచ్‌డీ స‌రౌండ్ సౌండ్‌, 4జీ వీవోఎల్‌టీఈ
* 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 4 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్‌, ఓషియ‌న్ వేవ్‌, వ‌యొలెట్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో విడుద‌ల కాగా.. రూ.7,999 ధర‌కు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 28వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news