ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం, సుఖం రెండు ఉంటాయి. అలానే గెలుపు ఓటమి రెండు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే గెలుపు ఓటమి రెండు ఉండవు. ఒకసారి ఓటమిపాలైనా పరవాలేదులే మరోసారి గెలుస్తాను అని ఎవరికి వారు చెప్పుకుని మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలవడానికి అవుతుంది. చాలామంది ఐపీఎస్ ని లక్ష్యంగా పెట్టుకుంటారు.
ఐపీఎస్ అవ్వాలని ఎంతగానో కష్టపడుతూ ఉంటారు నిజానికి ఐపీఎస్ అవడం అంత ఈజీ కాదు. కానీ ఈయన మాత్రం ఐపీఎస్ లో క్వాలిఫై అయ్యారు. గతంలో ఎసై ఉద్యోగం కోసం పరీక్ష రాయిగా దానిలో విఫలమయ్యారు. మరి ఇంకా ఈయన సక్సెస్ స్టోరీ గురించి చూస్తే… తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గ్రామానికి చెందిన సంకీర్త్ పోలీస్ అవ్వాలని లక్ష్యంతో పరీక్షలకి సిద్ధమయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఎస్సై రిక్రూట్మెంట్ పరీక్షలో పాసయ్యారు. కానీ ఎనిమిది వందల మీటర్ల రేసుని పూర్తి చెయ్యడానికి 160 సెంకండ్లు పట్టింది. కొన్ని సెకన్ల తేడాతో విఫలం అవడం జరిగింది. ఫిట్నెస్ మరింత పెంచుకోవాలని దీనిపై శ్రద్ధ పెట్టారు. అయితే యుపిఎస్సి కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. రోజంతా సివిల్స్ పరీక్షల కోసం చదివేవారు అలానే ఫిట్నెస్ పైన కూడా దృష్టిపెట్టారు. యుపిఎస్సి పరీక్షల లో సక్సెస్ పొందారు. 330 ర్యాంక్ ని సాధించారు.
నిజానికి మనం గెలవాలి అని దేని మీద అయినా దృష్టి పెడితే ఖచ్చితంగా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరైనా సరే గెలవచ్చు ఎవరైనా సరే అనుకున్నది సాధించొచ్చు. కానీ దానికి తగ్గ కష్టం దాని మీద కాస్త ధ్యాస ప్రయత్నం ఇవన్నీ చాలా ముఖ్యం. నిజానికి సీరియస్ గా దేని మీదైనా ఎవరైనా ఏకాగ్రత పెడితే ఖచ్చితంగా అందులో సక్సెస్ అవ్వచ్చు. మీరు కూడా ఎప్పటి నుండో దేనినైనా సాధించాలని సాధించలేకపోతున్నారా అయితే మీరు ఈయనని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళండి కచ్చితంగా ఈయన అలాగే మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు.