ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే కష్టాలని జాగ్రత్తగా దాటుకు వెళ్ళిపోతే జీవితాంతం ఎంతో ఆనందంగా ఉండడానికి అవుతుంది. చాలా మంది ఆ కష్టాలు ని దాటలేక.. కష్టాల కోసం ఆలోచించలేక వాటి నుండి దూరంగా ఉంటారు దీనితో జీవితాంతం కష్టాలు ఉంటూనే ఉంటాయి. అయితే నిజానికి కొంతమంది జీవితాన్ని చూస్తే ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి. వాళ్లని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఈమెను మీరు స్ఫూర్తిగా తీసుకుంటే కచ్చితంగా మీ జీవితం కూడా బాగుంటుంది పదో తరగతి పూర్తయిన తర్వాత ఈమెకి వివాహం చేసేసారు. తర్వాత ఈమె అత్తగారితో కలిసి కట్టెలు కొట్టి వాటిని అమ్మేవారు. డ్వాక్రా ద్వారా 1500 రూపాయలు లోన్ వచ్చింది. దీనితో ఈమె పచ్చళ్ళ ని సేల్ చేయడం మొదలుపెట్టారు. ఒక కొట్టు పెట్టి అందులో పచ్చళ్ళు పెట్టి అమ్మే వాళ్ళు. అయితే ఈ ఐడియా ని చాలామంది చిన్నచూపు చూసేవారట.
ఈమె ఇంక ఏం చేయాలో తెలియక పది రూపాయల ప్యాకెట్లని తయారుచేసి నచ్చితేనే డబ్బులు ఇవ్వమని పంచిపెట్టి వచ్చేసారు. కానీ నిజానికి ఈమె దశ ఇలా తిరిగిపోయింది. అందరికీ పచ్చళ్ళు నచ్చాయి. అమ్మకాలు పెరిగాయి. ఈమె భర్త బిఈడి చదువుతానని చెప్పారట ప్రభుత్వ ఉద్యోగం వస్తే లైఫ్ మారిపోతుందని చెప్పారు ఆయన ఫీజు కట్టేందుకు ఈమె 25 కేజీల పచ్చళ్ళు నెత్తి మీద మోసుకుని అమ్మడానికి వెళ్లేవారు.
అప్పుడు ఆమె 7వ నెల గర్భవతి. రేషన్ బియ్యం తినడం.. ఎంతో కష్టపడి పని చేయడం ఎలా ప్రతిరోజూ ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈమె భర్త చదువు పూర్తయిన తర్వాత కాంటాక్ట్ పద్ధతిలో 1200 రూపాయలకే టీచర్ గా చేరారు అయినా ఆ జీతం సరిపోదు ఈసారి డ్వాక్రా నుండి ఇరవై ఐదు వేల రూపాయలను లోన్ తీసుకుని అమృత పచ్చళ్ళని స్టార్ట్ చేశారు.
ఈమె ఉత్పత్తుల గురించి తెలిసిన డిఆర్డిఏ అధికారులు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ కి పిలిచారు ఆమె ఆరోగ్యం బాగోక పోయినప్పటికీ అక్కడికి వెళ్లి పచ్చళ్లను అమ్మారు. ఇంక చూసుకోండి.. ఈమె లైఫ్ తిరిగిపోయింది. పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చాయి అప్పటి నుండి చెన్నై బెంగళూరు ఢిల్లీ తెలంగాణ ఆంధ్రాలో చాలా మంది పచ్చళ్ళు కొనడం మొదలుపెట్టారు ఈమె ఇప్పుడు వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ కారంపొడులు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. లాక్ డౌన్ 20 లక్షలు నష్టం వచ్చింది. ఇప్పుడు ఆమెకి 80 నుండి 90 లక్షల వార్షిక ఆదాయం వస్తోంది. పైగా 20 మంది మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తోంది.