స్ఫూర్తి: 497 యాచక పిల్లలకి చదువు చెప్పిన దంపతులు.. చూస్తే శబాష్ అంటారు..!

-

మనం బయట చూస్తూ ఉంటే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు పిల్లల్లని ఒత్తిడి చేసి డబ్బులు నలుగురుని అడిగి తీసుకు రమ్మంటారు. నిజంగా ఆ యాచక పిల్లల జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. ప్రతి పూట తిండి కోసం అందర్నీ డబ్బులు అడగడం… చెత్తకుప్పల్లో ఏదైనా ఆహారం ఉంటే తీసుకుని తినడం మనం చూస్తూ ఉంటాం. అయితే నిజంగా అటువంటి వాళ్ళకి సహాయం చేయాలి అంటే మంచి హృదయం ఉండాలి.

జయంతి మరియు అరుణ లాగ మంచి మనసు ఉంటే అలాంటి వాళ్ల జీవితం ఎంతో బాగుంటుంది. అయితే అరుణ తన భర్త జయంతి తో కలిసి యాచక బిడ్డలకి ఎలా సహాయం చేసింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. నిజంగా వీళ్ళ యొక్క శ్రమ మరియు సేవా చూస్తే శభాష్ అంటారు. గత 15 ఏళ్ల నుండి కూడా వీళ్ళు యాచక పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు.

free education beggar children

ప్రభుత్వ ఉద్యోగి అయిన జయంతి రిటైర్ అయిపోయిన తర్వాత నుండి కూడా ఇటువంటి పిల్లలకి చదువు చెప్పడం మొదలుపెట్టారు. యాచక పిల్లలలా అయిపోవడం చూసి వాళ్ళు ఎంతో కుంగిపోయారు. తమ వంతు సహాయం చేయాలని పల్లెటూర్లలో, స్లమ్ ఏరియాస్ లో ఉండే యాచక బిడ్డలకి చదువులు నేర్పించడం మొదలుపెట్టారు.

విద్య అనేది జీవితాన్ని మారుస్తుంది. అయితే వాళ్ళకి భోజనం పెట్టడం తో పాటు చదవని కూడా ఇచ్చారు. వీళ్ళు మొదలు పెట్టిన మొదటి సంవత్సరం 45 మంది పిల్లల్ని చదివించారు. ఇప్పటికి మొత్తం 497 మంది పిల్లలకి చదువులు చెప్పించారు. అయితే పిల్లల్లో 30 మంది ప్లంబర్స్, డ్రైవర్లు అయ్యారు

మరికొందరు టీ షాప్ పెట్టుకున్నారు. నిజంగా ఇలా జీవితాన్ని మార్చడం సులభం కాదు కానీ వీళ్ళు చేసి చూపించారు. సంవత్సరానికి ఈ పని చేయడానికి వీళ్ళు 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు వీళ్ళ యొక్క డబ్బులతో పాటు ఫండ్స్ వంటివి కూడా కలెక్ట్ చేసి యాచక బిడ్డలకు మంచి జీవితాన్ని అందించి స్ఫూర్తిగా నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news