తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్ పరీక్ష ఫీజు తగ్గింపు

-

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. ఇంటర్ పరీక్ష ఫీజు తగ్గిస్తూ.. విద్యార్థులకు బిగ్‌ రిలీఫ్‌ ఇచ్చింది ప్రభుత్వం. మిక్స్‌డ్ ఆక్యు పెన్సి కారణంగా 446 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు పొందలేదు.

దీంతో ఆయా కాలేజీల్లోని విద్యార్థులు ఇంకా పరీక్ష ఫీజు చెల్లించలేదు. అలాంటి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రస్తుతం ఉన్న ఆలస్య రుసుము రూ.1000ని రూ.100కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 90,000 మంది విద్యార్థులకు ఉపశమనం కలగనుంది. కాగా, ఇంటర్‌ పరీక్షలు మార్చిలో జరుగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news