నా భర్త వెంటే నేనూ.. పార్టీ మారడంపై మాజీ మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ మాజీ మంత్రి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. తన భర్త వెంటే తాను ఉంటానని చెప్పారు. మనగలిగినన్ని రోజులు వైసీపీలోనే ఉండాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇంకేం చెప్పారంటే..?

‘రాజకీయంగా మా మనుగడ అంటే వైసీపీతోనే అని ఎప్పుడూ చెబుతాం’ అని మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ‘సుచరిత ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చిందంటే నా భర్త దయాసాగర్‌ కూడా దానికి కట్టుబడి ఉంటారు. అలాకాకుండా దయాసాగర్‌ పార్టీ మారతాను. నువ్వు నాతో రా అంటే నేను ఎంత రాజకీయ నాయకురాలినైనా, ఒక భార్యగా నేను నా భర్త అడుగుజాడల్లో నడుస్తాను కదా…’ అని ఆమె వ్యాఖ్యానించారు.

గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘దయాసాగర్‌ ఒక పార్టీలో, సుచరిత ఇంకో పార్టీలో, పిల్లలు చెరొక పార్టీలో ఉండరు. అందువల్ల జగన్‌మోహన్‌రెడ్డి పార్టీతో మనగలిగినన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నాం. మేం వైసీపీ కుటుంబ సభ్యులం. ఒకే ఇంట్లో ఉండే ఐదుగురిలో కూడా విబేధాలు ఉంటాయి. అంత మాత్రాన వారు వేరని కాదు…’ అని ఆమె స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news