2021 Round up : 2021 లో బెస్ట్ కంపెనీగా మైక్రోసాఫ్ట్.. వరెస్ట్ కంపెనీ ఏదంటే..?

-

వ్యాపారంలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. పైగా తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేము. ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా వ్యాపారం విషయంలో అద్భుతాలు చోటుచేసుకున్నాయి.

కొన్ని ఘోరమైన పతనాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. అయితే గ్లోబల్ ట్రేడింగ్ లో మాత్రం ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పైగా కరోనా ప్రభావం కూడా వ్యాపారంపై గట్టిగా ఎఫెక్ట్ చేసిందని చెప్పొచ్చు అయితే ఈ సంవత్సరం మొత్తం మీద కంపెనీ పని తీరును మరియు ఇతర కారణాలనీ పరిగణలోకి తీసుకుని ఏ కంపెనీ బెస్ట్, ఏ కంపెనీ వరెస్ట్ అనేది కూడా ఓటింగ్ చేయడం జరిగింది.

అయితే మరి ఈ సంవత్సరం మొత్తం మీద ఏ కంపెనీ బెస్ట్ గా నిలిచింది..?, ఏ కంపెనీ వరస్ట్ గా నిలిచింది అనేది ఇప్పుడు చూద్దాం. వ్యాపారంలో ఏదో ఒక అద్భుతం చోటు చేసుకుంటూ ఉంటుంది. అది ప్రతి ఏటా సాధారణమే. ఈ ఏడాది మాత్రమే కొత్త కాదు. అయితే మరి ఈ ఏడాది బెస్ట్, వరస్ట్ కంపెనీల జాబితా గురించి చూద్దాం.

డిసెంబర్ 4, 5 తేదీల్లో యాహూ ఫైనాన్స్ హోం పేజ్ నుండి సర్వే మంకీ ద్వారా ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వేలో ”మెటా” కంపెనీని వరస్ట్ గా పరిగణించారు. ఈ లిస్ట్ లో రెండో స్థానంలో చైనా కంపెనీ ”అలీబాబా” నిలిచింది. ఫేస్ బుక్ మెటా గా మారిన కూడా వరస్ట్ హోదాను కట్టబెట్టాయి.

ఫేస్ బుక్ చేసిన తప్పుని కరెక్ట్ చేసుకోగలదని అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. ఇది ఇలా ఉంటే యాహు ఫైనాన్స్ లిస్ట్ లో బెస్ట్ కంపెనీ గా ”మైక్రోసాఫ్ట్” నిలిచింది. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే వాటిని 53 శాతానికి పెంచుకోవడంతో పాటు 2 ట్రిలియన్‌ మైలురాయి దాటడం వలన ఈ కంపెనీకి కలిసి వచ్చిందని చెప్పచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news