Ram Charan: ఎక్స్‌పరిమెంట్స్‌తో ముందుకు సాగుతున్న రామ్ చరణ్..వెర్సటైల్ యాక్టర్‌గా మెగా పవర్ స్టార్

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్..తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ ఇమేజ్ ను మ్యాచ్ చేయగల సత్తా రామ్ చరణ్ కు ఉందని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, రామ్ చరణ్ తన సినీ జర్నీలో తనను తాను కనుగొనే ప్రయత్నం చేశారనే డిస్కషన్ ప్రజెంట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ జరుగుతోంది.

తనకున్న స్టార్ రేంజ్ ను పక్కనబెట్టేసి మరీ..ఘట్స్ తో మెగా పవర్ స్టార్ ప్రయోగాలకు సిద్ధమై సక్సెస్ అందుకుంటున్నారని మెగా పవర్ స్టార్ అభిమానులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన నటించిన ఫిల్మ్స్ గురించి పేర్కొంటున్నారు. నేచురాలిటీ, వెర్సటాలిటికీ ప్రయారిటీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

కేవలం గెటప్ లో వేరియేషన్ మాత్రమే కాదు.. పాత్రలో వైవిధ్యత కనబర్చేందుకు రామ్ చరణ్ తన వంతు కృషి చేస్తున్నారు. సుకుమార్క్ ఫిల్మ్ ‘రంగస్థలం’లో ‘చిట్టిబాబు’ పాత్ర రామ్ చరణ్ కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రామ్ చరణ్ వేరియేషన్ చూసి నార్మల్ ఆడియన్సే కాదు సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ తదితర సినీ ప్రముఖులు తెగ పొగిడేశారు. పవన్ కల్యాణ్ అయితే రామ్ చరణ్ సంపూర్ణ నటుడని, ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని పొగిడేశారు.

RRR పిక్చర్ లోనూ రామ్ చరణ్ పాత్ర రామరాజుకు మల్టిపుల్ వేరియేషన్స్ ఉండటం విశేషం. అలా క్యారెక్టరైజేషన్స్ ఉన్న పాత్రను ఎంచుకుని నటుడిగా వైవిధ్యతను చూపించి రామ్ చరణ్ సక్సెస్ అవుతున్నారని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో ‘సిద్ధ’గా రామ్ చరణ్ నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని మేకర్స్ అంటున్నారు.

RC15లో రామ్ చరణ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నదని, ఇప్పటికే లీక్ అయిన ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది. తెల్ల పంచెకట్టుకున్న గ్రామీణ యువకుడిగా రామ్ చరణ్ రోల్ ఎక్సలెంట్ గా ఉంటుందని అనిపిస్తుంది. ‘ధ్రువ’లోనూ రామ్ చరణ్ చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచారు. నెక్స్ట్ మూవీ గౌతమ్ తిన్ననూరి స్పోర్ట్స్ డ్రామా, కాగా, ఆ తర్వాత సుకుమార్ సినిమాలోనూ రామ్ చరణ్ -సుకుమార్ ల మార్క్ ఉండబోతున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version