‘గాడ్ ఫాదర్’లో ఆ రాజకీయ పార్టీ నేతగా చిరంజీవి.. పార్టీ పేరు ఇదే..!!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..‘ఖైదీ నెం.150’ ఫిల్మ్ తో సినీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి సినిమాల నుంచి రాజకీయాల్లోకెళ్లిన చిరు.. ఆ తర్వాత ఆ రాజకీయ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. అనంతరం.. సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు కేవలం సినిమాలే చేస్తు్న్నారు.

వరుస సినిమాల షూటింగ్స్ లో చిరంజీవి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆయన నటించిన నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’. కాగా, ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నది.

మాలీవుడ్(మలయాళం) కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు ఇది అఫీషియల్ తెలుగు రీమేక్. ఇందులో చిరంజీవి ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా కనిపించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్టోరిలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నుంచి విడుదలైన ఫొటోల్లో చిరంజీవి రాజకీయ పార్టీ పేరు ‘జన జాగృతి పార్టీ’ అని కనబడుతోంది. అది చూసి కొందరు ఇది తన తమ్ముడు పవన్ కల్యాణ్ ‘జనసేన పార్టీ’ పేరుకు దగ్గర్లో ఉందని అనుకుంటున్నారు. సునీల్, సత్యదేవ్, బ్రహ్మాజీ , నయనతార ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ‘గాడ్ ఫాదర్’ నుంచి అప్ డేట్ రాబోతున్నదని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news