వర్మ “ప‌వ‌ర్ స్టార్”పై రామ్ చ‌ర‌ణ్ హాట్ కామెంట్..!

-

దర్శకుడు ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న “ప‌వ‌ర్ స్టార్” సినిమాపై ఇటీవల నిర్మాత అల్లు అర‌వింద్ మండిప‌డ్డారు. హీరో నిఖిల్ కూడా వ‌ర్మ‌పై ప‌రోక్షంగా మండిప‌డ్డారు. ఇక‌ తాజాగా మెగా పవ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు లుక్ ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి “కేవలం పనికొచ్చే విషయాలనే వింటున్నాను” అని కామెంట్ పెట్టారు. వ‌ర్మ వ్యాఖ్య‌ల విష‌యంలోనే చ‌ర‌ణ్ ఈ కామెంట్ చేసారని నెటిజ‌న్స్ భావిస్తున్నారు.

ఈ క్రమంలో రేపు ఉద‌యం 11 గంట‌ల‌కి ప‌వ‌ర్ స్టార్ సినిమాని త‌న ఆర్జీవి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న వ‌ర్మ టాలీవుడ్‌లో ఎలాంటి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి వ‌రుస పోస్ట‌ర్స్  రిలీజ్ చేస్తూ వ‌స్తున్న ఆయ‌న రీసెంట్‌గా ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేశాడు. ఈ ట్రైల‌ర్‌లో ప‌వ‌న్ పాత్ర‌ని సెటైరిక‌ల్‌గా చూపించారని భావించిన అభిమానులు వ‌ర్మ ఆఫీస్‌పై దాడి చేశారు. పోలీసుల చొర‌వ‌తో ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news