International chocolate day:చాక్లెట్ తో ఇలా ఎప్పుడైనా తిన్నారా?

-

కొన్ని ప్రత్యెకమైన రోజులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.. మదర్స్ డే,ఫాధర్స్ డే లాగా చాక్లెట్ డే ఒకటి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 13న కూడా జరుపుకుంటారు, నిజానికి చాక్లెట్ డే సంవత్సరానికి 3 సార్లు జరుపుకుంటారు.ఫిబ్రవరి 9న, రెండవ సారి జూలై 7న.. మూడవ సారి ఈరోజు అంటే సెప్టెంబర్ 13న జరుపుకుంటారు.

చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా తింటారు.చాక్లెట్ కేక్ , చాక్లెట్ ఐస్ క్రీం వంటి అనేక రకాల డెజర్ట్‌లను తయారు చేయడానికి కూడా చాక్లెట్ ఉపయోగించబడుతుంది. ంగగ్మీరు చాక్లెట్ లను ఉపయోగించి టేస్టీ టేస్టీ లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు . ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లోనే మీరు చాక్లెట్ , మేరీ గోల్డ్ బిస్కెట్స్ తో రుచికరమైన లడ్డులను ఎలా చేసుకోవచ్చునో ఇప్పుడు  వివరంగా తెలుసుకుందాం…

కావలసిన పదార్థాలు:

మేరీ గోల్డ్ బిస్కెట్ -20

చాక్లెట్ సాస్- 3 టేబుల్ స్పూన్లు

కోకో పౌడర్- 1 టేబుల్ స్పూన్
చక్కెర- 2 స్పూన్
వెన్న- 5 స్పూన్
వెనీలా- ఎసెన్స్ కొన్ని చుక్కలు

తయారి విధానం:

ముందుగా , కోకో పౌడర్, చాక్లెట్ సాస్ ,చక్కెర లను తీసుకోవాలి..వీటన్నిటిని బాగా కలపండి. ఒక మృదువైన క్రీమ్ ఏర్పడే విధంగా ఈ వస్తువులన్నింటినీ మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల వెనీలా ఎసెన్స్ జత చేసి.. దానిలో ముందుగా తయారు చేసుకున్న బిస్కెట్ పౌడర్ ను జతచేసుకోండి.వీటిని మిక్స్ చేసి పిండిలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి నుండి చిన్న చిన్న లడ్డూలను సిద్ధం చేసుకోండి.ఇప్పుడు ఈ లడ్డూలను చాక్లెట్ ట్రేలో ఉంచండి. ఈ ట్రేని 1 గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి..అంతే రుచికరమైన లడ్డులు రెడీ..వీటిని పిల్లలు,పెద్దలు ఇష్టంగా తింటారు..

బిస్కెట్స్, చాక్లెట్లు తో లడ్డు అంటే వినడానికి కొత్తగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది..చాక్లెట్ ఒత్తిడి తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మం ముడతల సమస్యను దూరం చేస్తుంది. అయితే పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి..అప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news