అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు. బిజెపి పాలనలో ఇప్పటివరకు నెరవేరని హామీల చిట్టా విప్పారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తామన్నారు. ఫెయిల్, పేదల ఖాతాల్లో 15 లక్షలు…ఫెయిల్, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు…ఫెయిల్, పెద్ద నోట్ల రద్దు…ఫెయిల్, రైతుల ఆదాయం రెట్టింపు …ఫెయిల్, ఎం.ఎస్.ఎం.ఈలకు గంటలోపల రుణాలు… ఫెయిల్, అర్హులందరికీ ఇండ్లు… ఫెయిల్ ..
మేకిన్ ఇండియా….. ఫెయిల్, పటిష్టమైన లోక్ పాల్ బిల్లు..ఫెయిల్, నమామి గంగే… గంగానది ప్రక్షాళన..ఫెయిల్, నదుల అనుసంధానం…ఫెయిల్, టెర్రరిజం కూకటి వెళ్లతో పెకలిస్తాం…ఫెయిల్, బుల్లెట్ ట్రైన్…ఫెయిల్, హర్ ఘర్ జల్…ఫెయిల్. ఇలా అన్నింట్లో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీష్ రావు.