ప‌వ‌న్‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో షాక్.. సీఎం పై ఫ్యాన్స్ ఫైర్

-

జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్ సినిమా స‌మ‌యంలో టికెట్లు, బెన్ ఫిట్ షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌కుండా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జ‌గ‌న్ స‌ర్కార్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌గ తీర్చుకోవ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అవుతుంది. కాగ మార్చి 14న జ‌న సేన పార్టీ ఆవిర్భవ వేడుక‌లు చేయ‌డ‌నాకి జ‌న సైనికులు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా.. పార్టీ ఆవిర్భ‌వ దినోత్స‌వం రోజు విజ‌య‌వాడలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌ని జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే ఈ బ‌హిరంగ స‌భ‌కు జ‌గ‌న్ స‌ర్కార్ అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. దీంతో జ‌న‌సైనికులు సీఎం జ‌గ‌న్ పై మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప్ర‌తీకార చ‌ర్య‌ల్లో భాగంగానే స‌భ‌కు అనుమ‌తి ఇవ్వడం లేద‌ని ఆరోపిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను రాజ‌కీయంగా ఒత్తడి పెంచ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనేక కుట్ర‌లు చేస్తోంద‌ని విమ‌ర్శిస్తున్నారు.

అందులో భాగంగానే బ‌హిరంగ స‌భకు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాగ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమా స‌మ‌యంలోనూ జ‌గ‌న్ పై వివాదాలు వ‌చ్చాయి. తాజా గా స‌భ అనుమ‌తుల విషయంలో జ‌గ‌న్ మ‌రోసారి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news