రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రిగోజిన్ భవిష్యత్‌పై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ప్రిగోజిన్‌కు భవిష్యత్‌లో ముప్పు ఉందని.. ఆయనపై ఏ క్షణమైనా విష ప్రయోగం జరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు.
‘ప్రిగోజిన్ ఎక్కడున్నారో అమెరికాకు తెలీదు. అతడి స్థానంలో నేనుంటే.. నేను తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటాను. నా మెనూపై ఓ కన్నేసి ఉంచుతాను’ అంటూ ప్రిగోజిన్‌పై విష ప్రయోగం జరగొచ్చేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ‘ఇక సరదా మాటలన్నీ పక్కన పెడితే.. రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో ఎవరికీ కచ్చితంగా తెలీదని నేను భావిస్తున్నాను’ అని బైడెన్ అన్నారు. రష్యాలో ప్రిగోజిన్ భవిష్యత్తు ఏంటో ఎవరికీ కచ్చితంగా తెలియదని భావిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు.
రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్ యద్ధంలో పోరాడుతోన్న వాగ్నర్ గ్రూప్.. జూన్ 24న తిరుగుబాటుకు దిగిన విషయం తెలిసిందే. 24 గంటల్లోనే మళ్లీ వెనక్కి తగ్గడంతో తిరుగుబాటు ఆగిపోయింది.