BREAKING : రూ. 450 కోట్లు దాటిన ఆది పురుష్ కలెక్షన్స్.. అధికారిక ప్రకటన

-

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ఆది పురుష్ .. జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఊహించిన విధంగా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇకపోతే ఇవాళ్టి వరకు రూ.450 కోట్లు వసూలు చేసింది చిత్ర బృందం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

కాగా, తాజాగా నేపాల్ లోని కాట్మండు మేయర్ కు ఆది పురుష్ చిత్ర యూనిట్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సీత భారత్ లో పుట్టినట్టు చూపించగా… నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. అటు ఖాట్మండు మేయర్ సహా ఆ దేశ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డైలాగ్ తీసేసి క్షమాపణ చెప్పకుంటే భారత సినిమాలు తమ దేశంలో అనుమతించమని హెచ్చరించారు. దీంతో మేయర్, సెన్సార్ బోర్డులకు టి సిరీస్, యువి క్రియేషన్స్ క్షమాపణ చెబుతూ లేఖ రాశాయి.

Read more RELATED
Recommended to you

Latest news