చైనా కంపెనీ వింత ఆలోచన.. బాత్రూంలో టైమర్లు..

-

చైనా వాళ్ళ ఆలోచనలేంటో చాలా విచిత్రంగా ఉంటాయి. సాధారణంగా తమ కంపెనీ ఉద్యోగుల నుండి సరైన పని రాబట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి క్రమంలోనే చైనా కంపెనీ కుయిషా చాలా వింతగా ఆలోచించింది. ఆఫీసులో ఎంతసేపు పనిచేస్తున్నారో అన్న దానికి ఒక లెక్క ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ బాత్రూంకి కూడా టైమర్లు పెట్టడమే విచిత్రంగా తోస్తుంది.

తమ ఆఫీసు ఉద్యోగులు ఎంతసేపు బాత్రూంలో ఉంటున్నారో అన్న విషయమై టైమర్లు పెట్టారట. ఈ మేరకు ఇంటర్నెట్ లో ఆ పిక్చర్స్ వైరల్ అయ్యాయి. బాత్రూంకి టైమర్ ఫిక్స్ చేసిన ఫోటోలు చైనా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. చివరికి సరిగ్గా పోసుకోవడానికి కూడా స్వాత్రంత్ర్యం లేదంటూ కామెంట్లు పెట్టారు. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ కుయిషా వివరణ ఇచ్చింది.

ఆఫీసులో బాత్రూమ్స్ తక్కువగా ఉన్నాయని, దాని కారణంగా క్యూ పెరిగిపోతుందని, అందువల్ల ఆఫీసు పనికి నష్టం జరుగుతుందని అలా పెట్టామని తెలిపింది. బాత్రూములు తక్కువగా ఉంటే వాటి సంఖ్యని పెంచడానికి చూస్తారు గానీ, ఇలా మాత్రం ఎవరూ చేయరు.

Read more RELATED
Recommended to you

Latest news