కరోనా పుట్టింది అక్కడేనట.. ఎట్టకేలకు చైనా క్లారిటీ

-

కరోనా మూడేళ్ల క్రితం చైనా నుంచి వ్యాపించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి. లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుని.. ఎన్నో లక్షల కుటుంబాలను వీధిన పడేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా కుదేలు చేసింది. అయితే అప్పట్లో ఈ మహమ్మారి చైనాలోని వుహాన్ నుంచే వచ్చందనే వార్తలు వచ్చాయి. కానీ దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే ఈ విషయంపై చైనా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా అందులో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కరోనా వైరస్ ప్రథమంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందినట్లు చైనా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. కరోనా వైరస్‌ ప్రారంభమైన తొలినాళ్లలో హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచి సేకరించిన నమూనాలను అధ్యయనం చేసి మూడేళ్ల తర్వాత వాటి వివరాలను తాజాగా చైనా వెల్లడించింది. నమూనాలను పరీక్షించినప్పుడు అందులో అడవి జంతువుల జన్యుపదార్థాలు కూడా ఉన్నాయని పేర్కొంది.

చైనా శాస్త్రవేత్తలు ప్రకారం కేవలం హువాన్‌ చేపల మార్కెట్‌ నుంచి మాత్రమే కాకుండా దేశంలో జంతు మాంసాన్ని విక్రయిస్తున్న వివిధ ప్రాంతాల నుంచి స్వాబ్‌లను సేకరించారు. వాటిలోనూ కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. దీనిని బట్టి కరోనా వైరస్‌ వ్యాప్తికి జంతువులు ఒక కారణం కావొచ్చని నిర్ధరణకు వచ్చారు. రాకూన్‌ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్‌ కారక సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో చైనా శాస్త్రవేత్తల బృందం ఏకీభవించింది. అయితే, వాటి నుంచే వైరస్‌ వ్యాప్తి చెందిందనడానికి స్పష్టమైన ఆనవాళ్లు లేవని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news