మా ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోం.. అమెరికా, ఫిలిప్పీన్స్‌కు చైనా వార్నింగ్

-

అగ్రరాజ్యం అమెరికా, ఫిలిప్పీన్స్​కు యుద్ధ విన్యాసాలపై ఆ దేశాలకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఫిలిప్పీన్స్‌ల మధ్య ఏర్పడిన బలమైన రక్షణ బంధం/కూటమి కారణంగా తమ దేశ భద్రతకు, ప్రాదేశిక ప్రయోజనాలకు భంగం కలిగితే ఊరుకోబోమని హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ప్రాదేశిక జలాల వివాదాల్లోనూ జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది.

మంగళవారం రోజున ప్రారంభమైన అమెరికా, ఫిలిప్పీన్స్‌ ఉమ్మడి సైనిక విన్యాసాలు ఈనెల 28వ తేదీ వరకూ కొనసాగుతాయి. 1990లలో ఈ రెండు దేశాల సంయుక్త సన్నద్ధత తర్వాత ప్రస్తుత విన్యాసాలే సుదీర్ఘమైనవి. ఇందులో రెండు దేశాలకు చెందిన 17,600 మంది సైనికులతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన చిన్న బృందం పాల్గొంటోంది. వీటిని జపాన్‌, భారత్‌ వంటి 12 దేశాల నుంచి పరిశీలకులు సందర్శించనున్నారు.
విన్యాసాల్లో భాగంగా మంటలను ఆర్పే ప్రక్రియలో ఒక నౌకను సముద్రంలో ముంచనున్నారు. ఇలాంటి విన్యాసాలు ఎలాంటి మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోరాదని, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాలకు ఊతమిచ్చేలా ఉండాలని సూచిస్తూ… చైనా విదేశాంగశాఖ కార్యదర్శి వాంగ్‌ వెన్‌బిన్‌ మనీలాలోని చైనా విదేశాంగశాఖ కార్యాలయం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news