తన ట్వీట్లకు ప్రాధాన్యం దక్కేలా ఏకంగా కోడింగ్, ఆల్గరిథమ్‌లో మార్పులు చేయాలని ఎలాన్ మస్క్ ఇంజినీర్లకు సూచించారని ‘ప్లాట్‌ఫార్మర్’ వెబ్‌సైట్ ప్రచురించిన కథనంపై ఎలాన్ మస్క్ ఫైర్ అయ్యారు. ‘ఆ నకిలీ ‘ప్లాట్‌ఫార్మర్’ ఒక అసంతృప్తి ఉద్యోగి చెప్పిన మాటలు బట్టి కథనం రాసింది. అతను త్వరలో గూగుల్‌లో చేరనున్నాడు. కొద్ది నెలలుగా వేతనంతో కూడిన సెలవులో ఉన్నాడు. సంస్థ నుంచి బయటకు వెళ్లేముందు ఇక్కడ వాతావరణాన్ని విషపూరితం చేయాలనుకున్నాడు. ట్విటర్ అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది’ అని ట్విటర్ వేదికగా మస్క్ మండిపడ్డారు.
ఆదివారం రోజున ఫిలడెల్ఫియా ఈగిల్స్, కాన్సాస్ సిటీ చీఫ్స్ ఫుట్‌బాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మస్క్ ఈగిల్స్‌ను సపోర్ట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఈగిల్స్ జట్టుకే మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ట్వీట్‌కు 90 లక్షల ఎంగేజ్‌మెంట్లు రాగా.. బైడెన్ (Biden) ట్వీట్‌కు ఏకంగా 2.90 కోట్ల ఎంగేజ్‌మెంట్లు వచ్చాయి. దీన్ని మస్క్ జీర్ణించుకోలేకపోయారని ‘ప్లాట్‌ఫార్మర్’ కథనం సారాంశం. ఇదంతా బూటకమని మస్క్ కొట్టిపారేశారు.