డోనాల్డ్ ట్రంప్ కి షాకి ఇచ్చిన ఫేస్ బుక్..

అమెరికా మాజీ అధ్యక్షుడికి సోషల్ మీడియా సెగ గట్టిగా తగులుతుంది. ఇప్పటికే ట్విట్టర్ అకౌంట్ పూర్తిగా నిషేధిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఫేస్ బుక్ కూడా అదే దారిలో నడిచింది. ట్రంప్ ఫేస్ బుక్ అకౌంట్ ని నిషేధిస్తున్నట్లు ఫేస్ బుక్ ప్రకటించింది. రెండేళ్ళ పాటు ఈ నిషేధం ఉంటుందని తెలిపింది. 2023 జనవరి వరకు ట్రంప్ ఫేస్ బుక్ అకౌంట్ నిద్రావస్థలో ఉంటుందన్నమాట. ట్రంప్ ఫేస్ బుక్ పోస్టులు హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని, అది ఫేస్ బుక్ విధానాలకి విరుద్ధమని అందుకే నిషేధం విధిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఫేస్ బుక్ నిషేధంపై డోనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యాడు. ఇది అవమానమకరమని, నాకే కాదు నాకు ఓటేసిన 75మిలియన్ల అమెరికన్లు అందరికీ ఇది అవమానకరం అని కామెంట్లు చేసాడు. మొత్తానికి ట్విట్టర్ తర్వాత ఫేస్ బుక్ నిర్ణయంతో గట్టి దెబ్బే తగిలింది. ఈ విషయమై ఫేస్ బుక్ మాట్లాడుతూ, పాలసీ విధానాలను ధిక్కరించేలా, సమాజంలో హింసను రెచ్చగొట్టేలా ఉండే పోస్టులు పెట్టడాన్ని ఫేస్ బుక్ నిషేధించిందని, అలాంటి ఖాతాలని ఫేస్ బుక్ తొలగిస్తుందని వెల్లడి చేసింది.