ఉద్యోగులకు షాక్ ఇచ్చిన బైజూస్‌.. మరో 1000 మందికి ఉద్వాసన

-

ప్రముఖ ఐటీ, ఎడ్​టెక్, ఇతర సంస్థల్లో ఉద్యోగులకు ఉద్వాసన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ మరో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. దాదాపు అన్ని విభాగాల్లో తొలగింపులు ఉన్నట్లు ఓ ఉన్నతోద్యోగి తెలిపారు. ప్రస్తుతం బైజూస్‌ లో 50 వేల మంది పనిచేస్తున్నారు. ఇటీవల కొత్త వారిని నియమించుకున్న నేపథ్యంలోనే ఇంకా ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంది.

2023 మార్చి నాటికి లాభదాయకతను సాధించాలని బైజూస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా కంపెనీ పునర్‌వ్యవస్థీకరణను చేపట్టింది. గత ఏడాది అక్టోబరులో ఐదు శాతానికి సమానమైన 2,500 మందిని తొలగించింది. తాజా తొలగింపులపై బైజూస్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అమెరికాకు చెందిన ఓ ఆర్థిక సంస్థకు బైజూస్‌ 1 బిలియన్‌ డాలర్ల వరకు రుణం చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించిన వడ్డీ చెల్లింపునకు ఇటీవలే గడువు ముగిసింది. అయితే, ఈ విషయంపై బైజూస్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపులు చోటుచేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news