చైనా వింత నిబంధన.. వాళ్ల వ్యాక్సిన్‌ తీసుకుంటేనే వారి దేశంలోకి అనుమతి ఇస్తారట..!

Join Our Community
follow manalokam on social media

చైనాకు వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నారా ? అయితే మీరు చైనాలో తయారు చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు చైనా వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. భారత్‌లోని చైనా ఎంబస్సీ అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. చైనాతో తయారు చేసి కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకుంటేనే చైనాకు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు.

if you want to go to china then you need to take chinese covid vaccine

కరోనా నేపథ్యంలో గతేడాది నవంబర్‌ నుంచి చైనా తమ దేశానికి ఇండియా సహా పలు ఇతర దేశాలకు చెందిన పౌరులు రాకుండా నిషేధం విధించింది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన అనేక మంది చైనాకు వెళ్లలేకపోతున్నారు. చైనాలో దాదాపుగా 23వేల మంది భారతీయులు పలు మెడికల్‌ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్నారు. చైనా విధించిన నిషేధం వల్ల వీరందరూ ఇండియాలోనే ఉంటున్నారు. అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

కరోనా నేపథ్యంలో చైనాకు వెళ్లేందుకు నిషేధం విధించినందున మార్చి 15 నుంచి ఆ నిషేధాన్ని కొద్దిగా సడలించేందుకు చైనా ఎంబస్సీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే పైన తెలిపిన కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో చైనాకు వెళ్లి అక్కడ పనిచేయాలనుకునేవారు, కుటుంబ సభ్యులను కలవాలనుకునేవారు, ఇతరులు చైనా కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకుని ఆ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుందని, అలాంటి వారికే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని చైనా ఎంబస్సీ అధికారులు తెలిపారు. అయితే విద్యార్థులకు కూడా ఈ అవకాశం ఉంటుందా, లేదా.. అన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ చైనా విధించిన వింత నిబంధన మాత్రం అనేక మందికి ఇబ్బందులను తెచ్చి పెట్టేలా ఉంది. ఎందుకంటే భారతీయులకు ఇప్పటికే రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఒక వ్యాక్సిన్‌ను తీసుకున్న వారు చైనా వ్యాక్సిన్‌ను మళ్లీ ఎలా తీసుకుంటారు ? అది అసాధ్యం. కనుక అలాంటి వారి విషయంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...