మావాళ్ళను మాకు పంపండి.. ఏపీకి తెలంగాణ సర్కార్ లేఖ !

Join Our Community
follow manalokam on social media

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను తెలంగాణకి పంపించాలని ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినట్టు చెబుతున్నారు. 698 మంది ఉద్యోగులు అక్కడ పని చేస్తున్నారని చెబుతున్నారు. ఉద్యోగుల విభజన సమయంలో తెలంగాణకి ఆప్షన్ ఇచ్చినా ఏపీకి అలాట్ అయిన ఉద్యోగులను తెలంగాణకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధమని సర్వీస్ ర్యాంక్ లో చివరిలో చేరేందుకు ఒప్పుకుని అండర్ టేకింగ్ ఇచ్చే తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఏపీ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డికి తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు ఈమేరకు లేఖ రాశారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...