ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య పోరు రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. గాజాలోని అల్-పిషా ఆస్పత్రిని హమాస్ తన ప్రధాన కమాండ్ సెంటర్‌గా వాడుకుంటోందని ఆరోపిస్తోంది. అందుకోసం బలమైన సాక్ష్యాలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. తాజాగా ఆ ఆస్పత్రిలో బందీలను దాచి పెట్టిన వీడియోను ఇజ్రాయెల్ డిఫన్స్ ఫోర్స్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా బయటపెట్టింది.
అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హమాస్.. తమ దేశం నుంచి కొంతమందిని కిడ్నాప్ చేసి వారిని బందించేందుకు అల్-షిఫాకు తీసుకువెళ్లడం ఆ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోందని ఐడీఎఫ్లో తన ట్వీట్లో పేర్కొంది. అక్టోబరు 7న ఉదయం 10.42 నుంచి 11 గంటల మధ్య అల్-షిఫా ఆస్పత్రి సీసీటీవీ దృశ్యాలను విడుదల చేస్తూ.. ఆయుధాలతో ఉన్న హమాస్ ఉగ్రవాదులు ఓ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కెళ్లారని చెప్పింది. గాయపడిన మరో బందీని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తున్నట్లుగా వీడియోలో రికార్డ్ అయ్యిందని పేర్కొంది. అయితే ఇప్పుడు వారంతా ప్రాణాలతోనే ఉన్నారా..? బతికే ఉంటే ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదని పోస్టులో ఐడీఎఫ్ వ్యాఖ్యానించింది.
EXPOSED: This is documentation from Shifa Hospital from the day of the massacre, October 7, 2023, between the hours of 10:42 a.m and 11:01 a.m. in which hostages, a Nepalese civilian and a Thai civilian, were abducted from Israeli territory are seen surrounded by armed Hamas… pic.twitter.com/a5udjBw4wF
— Israel Defense Forces (@IDF) November 19, 2023