భూమిపై వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరికి అధిక వేడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం తెలిపింది. ఫలితంగా మరణాల రేటు 6 రెట్లు పెరగవచ్చని పేర్కొంది. ఈ వివరాలు ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్‌లో తాజాగా ప్రచురితమయ్యాయి.
రాత్రి సమయాల్లో వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ నిద్రకు భంగం వాటిల్లుతోందని అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. తక్కువ నిద్ర ఫలితంగా రోగనిరోధక శక్తి తగ్గి ఆరోగ్యంపై పలు రకాల దుష్ప్రభావాలు పడతాయని, మరణాల రేటు పెరుగుతుందని వెల్లడించారు. తూర్పు ఆసియా దేశాలైన చైనా, దక్షిణకొరియా, జపాన్‌లోని 28 నగరాల్లో సరాసరి రాత్రి ఉష్ణోగ్రతలు 2090 నాటికి రెట్టింపు అవుతాయని, 20.4 డిగ్రీల సెల్సియస్ నుంచి 39.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరతాయని అధ్యయనంలో గుర్తించారు.
సమస్త జీవరాశికి మూలమైన ఈ నక్షత్రంపై కేవలం రెండు వారాల వ్యవధిలోనే 35 భారీ విస్ఫోటనాలు, 14 సన్స్పాట్లు, ఆరు సౌర జ్వాలలు సంభవించాయి. వాటిలో కొన్ని నేరుగా భూమినీ తాకాయి! అయితే.. ‘సౌర చక్రం’ గరిష్ఠ స్థాయికి సమీపిస్తుండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘2025లో సౌర చక్రం గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. ఇది సమీపంలోనే ఉన్నందున ఈ తరహా ఘటనలు పెరుగుతూనే ఉంటాయి. కానీ, గత కొన్ని వారాల్లో ఇవి అంచనాలకు మించి వేగంగా సంభవిస్తున్నాయి. భూమిపై ఉన్న జీవరాశులు, సాంకేతికత, అలాగే కృత్రిమ ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, వ్యోమగాములపైనా ఇవి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి’ అని నాసా తెలిపింది.