పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు జరిమానా..

-

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే సొంత పక్షం నుంచి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాక్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ సర్కార్ కు 75 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. 342 మంది ఉన్న జాతీయ అసెంబ్లీలో 172 మంది మద్దతు కావాలి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు ఇమ్రాన్ ఖాన్ దూరంగా ఉన్నారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మూడు పార్టీలు కూడా ప్రస్తుతం ప్రతిపక్షంతో చేరాయి.

ఇదిలా ఉంటే పాక్ ప్రధానికి షాక్ ఇచ్చింది అక్కడి ఎన్నికల సంఘం. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనకు రూ.50 వేలు జరిమానా విధించింది. ఇటీవల స్వాత్ లోయలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ నిబంధనలను ఉల్లంఘించారు. ఖైబర్ పఖ్తున్వ్కా లో జరిగే స్థానికసంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లవద్దని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడి ఎన్నికల కమీషన్ నిషేధం విధించింది. అయితే వీటిని భేఖాతరు చేస్తూ… ఇమ్రాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో జరిమానా విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version