అవిశ్వాసానికి ముందు పాక్ లో కీలక పరిణామాలు…. దేశంలో ఆందోళనలు చేయాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపు

-

అవిశ్వాసం ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేపు ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరుగనుంది. అయితే రేపు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఇమ్రాన్ ఖాన్. ఆందోళనల్లో యువత పాలుపంచుకోవాలని ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే పార్టీ ఎంపీలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పార్టీ లైన్ కు వ్యతిరేఖంగా ఎవరైనా ఓట్ వేస్తే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తనను తొలగిస్తేనే అమెరికాలో సత్సంబంధాలు ఉంటాయని ఓ అధికార పత్రాన్ని పాక్ పార్లమెంటరీ కూడా చూసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. షాబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినట్లయితే అమెరికాకు బానిసత్వం చేస్తారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. విదేశీ కుట్రదారులు పాక్ ప్రతిపక్ష నేతల్ని మేకల్లా కొంటున్నారని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు ఆదేశ ప్రభుత్వ న్యాయ విభాగం హెచ్చరించింది. రహస్య సమాచారాన్ని పంచుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version