భారత్ ను దోచుకున్న మీరా.. మాకు నీతులు చెప్పేది : పుతిన్

-

అమెరికా, పశ్చిమ దేశాలపై రష్యా అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. భారత్, ఆఫ్రికాలను దోచుకున్న మీరా మాకు నీతులు చెప్పేది అంటూ నిప్పులు చెరిగారు. నియమాలకు లోబడి ప్రపంచక్రమం ఉండాలని నీతులు చెబుతోన్న పశ్చిమ దేశాలు, అమెరికా వాటినెప్పుడూ పాటించలేదని విమర్శించారు. ఉక్రెయిన్‌ భూభాగాలైన దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపొరీజియాను రష్యాలో విలీనం చేస్తూ సంతకాలు చేసిన తర్వాత పుతిన్‌ ప్రసంగించారు. దీని ఆంగ్ల అనువాదాన్ని తాజాగా మాస్కో విడుదల చేసింది.

ఈ ప్రసంగంలో పుతిన్.. పశ్చిమదేశాల ద్వంద్వ విధానాన్ని ప్రశ్నించారు. ‘‘నియమాల ఆధారంగా ప్రపంచక్రమం ఉండాలని పశ్చిమ దేశాలు అనడం మనం వింటూ ఉంటాం. ఆ నిబంధనలను ఎవరు చూశారు? ఎవరు అంగీకరించారు? ఇదంతా చెత్త. తీవ్ర నయవంచన. ద్వంద్వ ప్రమాణాలు. వారు మనల్ని మూర్ఖులు అనుకుంటారు. మధ్యయుగాల్లోనే పశ్చిమదేశాలు వలస విధానాలను అమల్లోకి తెచ్చాయి. అనంతరం బానిస వ్యాపారమూ జరిగింది. అమెరికాలో రెడ్‌ ఇండియన్లు ఊచకోతకు గురయ్యారు. భారత్‌ను, ఆఫ్రికాను పశ్చిమ దేశాలు దోచుకున్నాయి. ఇది మానవ స్వభావానికి, స్వేచ్ఛకు, న్యాయానికి వ్యతిరేకం’’ అని పుతిన్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news