ట్రంప్‌ కంటే బైడెన్‌ బెటర్‌.. రీజన్ చెప్పిన పుతిన్‌

-

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జో బైడన్ రెండోసారి గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రష్యా తెలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ మేలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌  అన్నారు. ఎవరు గెలిచినా వారితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కానీ, మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్‌ గెలవాలని తాను కోరుకుంటానని అన్నారు. బైడెన్‌ అనుభవం, అంచనా వేయగల నేత అని పుతిన్‌ అభిప్రాయపడ్డారు.

అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించేందుకు నిరాకరించిన పుతిన్.. తాను వైద్యుణ్ని కాదని ఆ విషయాలపై వ్యాఖ్యానించడం సరికాదని సున్నితంగా తిరస్కరించారు. అమెరికా ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ ఇలాంటి విమర్శలు తీవ్రరూపం దాలుస్తున్నాయని తెలిపారు. 2021లో తాను బైడెన్‌ను స్విట్జర్లాండ్‌లో కలిసినప్పుడు కూడా ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని… కానీ, అప్పటికి ఆయన సాధారణంగానే ఉన్నారని వెల్లడించారు. బైడెన్‌ విధానాలు చాలా బలంగా ఉంటాయని పుతిన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version