పుతిన్‌ ప్రాణాలకు ముప్పు.. ఎలా కాపాడుకోవాలో తెలుసన్న రష్యా

-

ఉక్రెయిన్​పై రష్యా భీకర యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్​పై కీలక వ్యాఖ్యలు చేసింది. తమ కిల్ లిస్టులో రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదటి స్థానంలో ఉన్నారని ఉక్రెయిన్‌ నిఘా అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి రష్యా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పుతిన్ భద్రత విషయంలో ఏం చేయాలో తమ సిబ్బందికి తెలుసని బదులిచ్చారు.

‘కీవ్‌ పుతిన్‌ను హత్య చేయాలని అనుకుంటోంది. ఎందుకంటే యుద్ధంలో ఏం జరగాలనేది ఆయనే నిర్ణయిస్తున్నారు. మా కిల్‌ లిస్ట్‌లో తొలివరుసలో ఆయన పేరే ఉందని పుతిన్‌కు తెలుసు. మేం చేరువగా వస్తున్నామని పుతిన్‌ గుర్తించారు. అలాగే సొంత వ్యక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోతాననే భయంతో జీవిస్తున్నారు. మా జాబితాలో పుతిన్‌తో పాటు రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌, రక్షణ శాఖ మంత్రి సెర్గీ షొయిగు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. పుతిన్‌ను టార్గెట్ చేయడం కష్టసాధ్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా సురక్షిత ప్రాంతాలకే పరిమితం అవుతున్నారు. కానీ, ఇటీవల తరచూ బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు’అంటూ ఉక్రెయిన్‌ మిలిటరీ ఇంటిలిజెన్స్ సర్వీస్‌కు చెందిన వాదిమ్‌ స్కిబిట్స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news