చాలా ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై పరిశోధనలు చేస్తున్నారు. అసలు ఏలియన్స్ నిజంగానే ఉన్నాయా లేవా ఇప్పటికీ క్లారిటీ మాత్రం రాలేదు. అయితే నిజంగా ఏలియన్స్ ఉన్నాయనడానికి ఊతమిచ్చే ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఇంతకీ ఏమైందంటే..?
భూమి సమీపంలో ఉన్న అంగారక గ్రహం నుంచి ఎన్‌కోడ్ చేసిన ఓ సమాచారాన్ని యూరప్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్(టీజీఓ) భూమికి చేరవేసింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా గమనించేందుకు యూరప్ స్పేస్ ఏజెన్సీ టీజీఓను గతంలో ప్రయోగించింది. అయితే, ఈ సందేశాన్ని గ్రహాంతర వాసులే పంపించారా? అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు.
అంగారక గ్రహం నుంచి సమాచారాన్ని స్వీకరించిన టీజీఓ 16 నిమిషాల్లో ఆ సందేశాన్ని ఎర్త్ స్టేషన్‌కు చేరవేసింది. అందులో ఏముందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒక వేళ అది గ్రహాంతర వాసులే పంపిన సమాచారమైతే.. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని ‘ఎ సైన్స్ ఇన్ స్పేస్’ ప్రాజెక్టులో భాగమైన డానియేలా ది పౌలిస్ తెలిపారు.