శ్రీలంక దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాపై బ్లాక్ అవుట్

-

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో శ్రీలంక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. గత కొన్ని రోజులుగా శ్రీలంకలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చివరకు కొందాం అనుకున్నా సరుకులు లేని పరస్థితి ఏర్పడింది. మరో వైపు డిజిల్, పెట్రోల్ కోసం గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడుతున్నారు ప్రజలు. మరోవైపు దేశ వ్యాప్తంగా 13 గంటల పైగా విద్యుత్ కోతలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఆందోళనలు చేస్తున్నారు. 

దీంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశంలో శుక్రవారం నుంచి అత్యవసర పరిస్థితిని విధించారు. అత్యవసర పరిస్థితి విధించిన ప్రజలు ఆందోళన చేశారు. దీంతో 36 గంటల పాటు కర్ప్యూ విధించారు. ఎవరైనా రోడ్లపైకి వస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని హెచ్చిరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కీలక నిర్ణయం తీసుకుంది శ్రీలంక ప్రభుత్వం. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా బ్లాక్ అవుట్ ప్రకటించింది. దీంతో ఆందోళనలకు మరింతగా అణచివేయవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news