ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్ల ప్రతీకారం.. చిన్నారి బాలుడు బలి

ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని పడగొట్టి, తాలిబన్ల జెండా ఎగరచ్వేసిన తర్వాత ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోమని, ఎవ్వరిపై దాడులు జరపమని, పౌరుల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకుంటామని చెప్పిన తాలిబన్లు చిన్నారి బాలుడిపై తమ ఆకృత్యాన్ని ప్రదర్శించారు. బాలుడి తండ్రి తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న అనుమానంతో చిన్నారి బాలుడిని హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తఖార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాలుడి తండ్రి తమ దళాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారు.

ఇదేకాదు తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన పంజ్ షిర్ ప్రాంతంలో ప్రతీకార హత్యలు జరుగుతున్నట్లు అమెరికాకు చెందిన ఏబీసీ తెలియజేసింది. ఏబీసీ ప్రకారం అక్కడి పౌరులు ఇలా మాట్లాడారు. తాలిబన్లు నా కుటుంబం మీద ఐదు సార్లు దాడులు జరిపారని ఒక యువకుడు తెలియజేసాడు. అలాగే, మరో యువకుడు తన ఫోన్ తీసుకున్నారని, అందులో ఏదైనా అనుమానాస్పద ఫోటోలు ఉన్నాయేమో చెక్ చేసారని, అలాంటిదేమైనా కనిపిస్తే అక్కడికక్కడే చంపేస్తున్నారని ఏబీసీకి తెలిపారు.