మా ఓట్లు దొంగతనం చేస్తున్నారు: ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టెన్షన్ లో ఉంటున్నారు. తన ప్రత్యర్ధి లక్ష్యంగా ఆయన విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఒక ట్వీట్ చేసారు. తమ సీట్లను దొంగలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. మేము భారీ విజయం సాధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

trump
trump

వారు మమ్మల్ని విజయానికి దూరం చేయాలని చూస్తున్నారు అన్నారు. మేము వారిని ఎప్పటికి అలా చేయనిచ్చేది లేదని అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత వేసిన ఓట్లు చెల్లవు అని అన్నారు. ఇక ఈ ట్వీట్ పై ట్విట్టర్ స్పందించి ఇది తప్పుదారి పట్టించే విధంగా ఉంది అని పేర్కొంది. కాసేపట్లో ఎన్నికల ఫలితాలపై ఒక స్పష్టత వస్తుంది.