ఎన్నికల ఫలితాలపై ట్రంప్ కు చుక్కెదురు..!

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని ట్రంప్ అత్యన్నత న్యాయస్థానానికి దావా వేసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ కు అక్కడ చుక్కెదురైంది. ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ట్రంప్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఎన్నికలపై ట్రంప్ న్యాయపోరాటానికి తెరపడింది. ట్రంప్ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సంచనల వ్యాఖ్యలను వెలువరించింది. నాలుగేళ్లుగా అత్యున్నత న్యాయస్థాన సమగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని, న్యాయమూర్తులను వివాదాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది.

trump
trump

ట్రంప్ వాదనలు చట్ట పరిమితులు దాటాయని, వ్యక్తిగతంగా న్యాయమూర్తుల నిష్పాక్షికతను పరీక్షించాయన్నారు. ఎన్నికలపై ట్రంప్ చేసిన ఆరోపణలను అర్ధరహితమని పేర్కొన్న దావాను శుక్రవారం కొట్టివేసింది. ఎలక్టోరల్ కాలేజీ సమావేశానికి గడువు సమీపిస్తుండటంతో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. సమావేశానికి మరో రెండు రోజులు గడువు ఉండగా.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో బైడెన్ గెలుపు లాంఛనం కానుంది. ఈ నెల 14వ తేదీన ఎలక్టోరల్ కాలేజీ సమావేశమై అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సిద్ధమైంది.

అత్యున్నత న్యాయస్థానంలో ఆరుగురి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. వీరిలో ముగ్గురిని నియమించారు. అయితే న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంతో న్యాయమూర్తులు ఎవరి పక్షపాతంగా వాదించదని మరోసారి రుజువైంది. జార్జియా, మిచిగాన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై రిపబ్లికన్ పార్టీకి చెందిన 18 మంది స్టేట్ అటార్నీ జనరల్, కాంగ్రెస్ లోని 126 మంది రిపబ్లికన్ సభ్యులు సంతకాలు చేసేలా టెక్సాన్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్ టన్, ట్రంప్ ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశారు.

టెక్సాన్, ఇతర రిపబ్లికన్ల ఆధ్వర్యంలో రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యర్థనలను న్యాయస్థానం తిరస్కరించకపోతే న్యాయవ్యవస్థ ప్రశ్నార్థకంగా మారేది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యాయస్థానం ఆయన తీరుపై సందేహాలను వ్యక్తం చేస్తూ వస్తోంది. ట్రంప్ వ్యతిరేక విధానాలు, వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలపై అడ్డుపడుతూ వస్తోంది. న్యాయానికి ప్రాముఖ్యతను అందించేలా ప్రయత్నాలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news