అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాలో నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు ముందే అమెరికా, భారతదేశం మధ్య “చిన్న వాణిజ్య ఒప్పందం” జరిగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఒక ఉన్నత దౌత్యవేత్త మీడియాకు వివరించారు. ఆర్థిక సంబంధాలను పెంచడానికి వాణిజ్య సమస్యలపై ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి భారతదేశం మరియు అమెరికా చర్చలు జరుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇక భారతీయులను దగ్గర చేసుకోవడానికి గానూ అమెరికా అధ్యక్ష అభ్యర్ధులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ తో మంచి సంబంధాల కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. అమెరికాలో ఉన్న భారతీయుల ఓట్ల కోసం కాస్త ఎక్కువగానే కష్టపడే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. అటు అమెరికా ఎన్నికల బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ ఇద్దరూ భారత్ పై ప్రసంశలు కురిపిస్తున్నారు.