అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ట్రంప్ మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించారని వైట్ హౌస్ తాజాగా తెలిపింది. ఈ ప్రతిభ ఆధారిత వలస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకు వస్తే నష్టపోయే విదేశీయుల్లో భారతీయ సంతతి పిల్లలు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పటికే డిసెంబర్ వరకు హెచ్1బీ, ఆ తరహా వీసాలను ట్రంప్ నిషేధించారు. అలాగే కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైతే, విదేశీ విద్యార్థులు దేశం విడిచివెళ్లాలని ఇప్పటికే అమెరికా పేర్కొంది.
అంతేకాకుండా కొత్తగా విద్యార్థి వీసాలను జారీ చేయబోమని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్ మెంట్(ఐసీఈ) స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే దీని మీద భారత్ స్పందిస్తూ ‘ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంబంధాల అభివృద్ధిల్లో విద్యా మార్పిడి పోషించిన పాత్రను దృష్టిలో పెట్టుకోవాలని’ అమెరికాకు సూచించిన సంగతి కూడా తెలిసిందే.