కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుంది. ఈ సందర్బంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆంధమ్ మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ పునః ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం. కానీ కరోనా పూర్తిగా వెళ్లిపోయినట్లు కాదు. ఏ ఒక్క దేశంలో కూడా మహమ్మారి అంతం అవ్వలేదు. కరోనాని నియంత్రించడంలో మనం సీరియస్‌గా ఉండాలి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని దేశాలు సురక్షితమైన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.
అలాగే చాలా దేశాలు తప్పుడు మార్గంలో వెళ్తున్నాయన్న టెడ్రోస్.. ప్రపంచానికి ఈ వైరస్సే ప్రధాన శత్రువు అవుతుందన్నారు. ఇప్పట్లో ఇదివరకటి రోజులు రాకపోవచ్చని, వైరస్‌ని కంట్రోల్ చేయడమే మన ముందున్న విధి అని తెలిపారు. అదేవిధంగా వైరస్‌ను ప్రపంచదేశాలు ఎంత నియంత్రిస్తే, ఆయా దేశాలు తమ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు అని టెడ్రోస్ పేర్కొన్నారు.