కేన్స్‌లో ఉక్రెయిన్‌ టెన్షన్.. ఒంటిపై ‘రక్తం’తో మహిళ నిరసన

-

అంతర్జాతీయ సినీ వేడుక కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఊహించని ఘటన జరిగింది. ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న భీకర యుద్ధాన్ని నిరసిస్తూ ఓ మహిళ కేన్స్ రెడ్ కార్పెట్​పై ఆందోళనకు దిగింది. ఉక్రెయిన్ జెండా రంగు దుస్తులు ధరించి.. డమ్మీ బ్లడ్​ను ఒంటిపై పోసుకుని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్నవారంతా ఉలిక్కిపడ్డారు.

76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భాగంగా ఆదివారం రోజున ‘ యాసిడ్‌’ సినిమా ప్రీమియర్‌ జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఎర్రతివాచీపై నిలబడి వరుసగా ఫొటోలకు పోజులిచ్చారు. అదే సమయంలో ఓ మహిళ ఉక్రెయిన్‌ జెండా రంగులైన నీలం, పసుపు వర్ణంలోని దుస్తులతో రెడ్‌కార్పొట్‌పైకి నడుచుకుంటూ వచ్చింది. కేన్స్‌ మెట్లపై ఫొటోలకు పోజులిచ్చింది. అనంతరం తన వెంట తీసుకొచ్చిన బాటిల్‌ను తెరిచి అందులోని ఎరుపు రంగుని తన తలపై పోసుకుంది శరీరమంతా రాసుకుంది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆ మహిళను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news