ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కారు ప్రమాదం

-

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీకి కారు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అధ్యక్షుడి కారు, కాన్వాయ్​ను ఓ కారు ఢీకొట్టింది. ఈ విషయాన్ని జెలెన్​స్కీ ప్రతినిధి సెర్హీ నైకిఫోరోవ్ తెలిపారు. ఈ ఘటనలో అధ్యక్షుడు స్వల్పంగా గాయపడ్డట్లు పేర్కొన్నారు.

‘జెలెన్​స్కీ వెంట ఉన్న వైద్యులు.. అధ్యక్షుడితో పాటు కారు డ్రైవర్​కు చికిత్స అందించారు. అనంతరం జెలెన్​స్కీని అంబులెన్సులో తరలించాం. అధ్యక్షుడికి తీవ్రగాయాలేమీ కాలేదు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపడతారు’ అని సెర్హీ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌పై భీకర పోరాటం చేస్తున్న రష్యా.. ఎట్టకేలకు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రష్యా సైనికులు పారిపోవడం తాము చూశామని స్థానికులు చెబుతున్నారు. రష్యా దళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఖర్కివ్​లోనే వదిలి పారిపోయినట్లు సమాచారం. ఇది రష్యన్లకు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. కీవ్ నుంచి దళాలు ఉపసంహరించుకున్న తర్వాత యుద్ధంలో మాస్కోకు జరిగిన ఘోర అవమానం ఇదేనని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news