ఐపీఎల్- 15 లో లీగ్ లోకి అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్ లోనే టైటిల్ కొట్టింది. పాయింట్ల పట్టికలో మొదటి నుంచి టాప్ లో కొనసాగుతూ వస్తున్న గుజరాత్ టైటాన్స్ టైటిల్ ని ఎగరేసుకుపోయింది. రాజస్థాన్ జట్టు పేలవంగా ఆడి ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్(39) ఒక్కడే రాణించాడు. యశస్వి జైస్వాల్(22) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్(14),దేవ్ దత్ పడిక్కల్(2),హిట్ మేయర్(11), అశ్విన్(6), ట్రెంట్ బౌల్ట్(11), రియాన్ పరాగ్(15),మెకాయ్ (8), పరుగులు చేశారు.
గుజరాత్ బౌలర్లలో హార్థిక్ పాండ్యా 3 వికెట్లు, సాయి కిషోర్ 2, రషీద్ ఖాన్, యశ్ దయాళ్, షమీ తలో వికెట్ పడగొట్టారు. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభమన్ గిల్(45) 43 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్, హార్థిక్ పాండ్యా(34), డేవిడ్ మిల్లర్ (32), రాణించగా.. సాహ (5),వెడ్ (8) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ద్ కృష్ణ,చాహల్ తలో వికెట్ పడగొట్టారు.