ఇండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ తన నైపుణ్యాన్ని ఐపీఎల్ లో చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు షమీ 9 మ్యాచ్ లలో 15 వికెట్లు సాధించి అత్యధిక బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఈ ఇండియా స్వింగ్ బౌలర్ ఆరంభంలోనే అద్భుతంగా బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఢిల్లీ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికి ప్రమాదకర ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ను డక్ అవుట్ గా అవుట్ చేశాడు. ఇది ఢిల్లీ పెద్ద షాక్ గా మారింది. ఆ తర్వాత వెంటనే వార్నర్ లేని పరుగుకు యత్నించి రన్ అవుట్ గా వెనుతిరిగాడు. ఇక ఇన్నింగ్స్ మూడవ ఓవర్ లో సౌత్ ఆఫ్రికా చిచ్చరపిడుగు రాసౌను చక్కని బంతికి కీపర్ కు క్యాచ్ ఇవ్వడం ద్వారా అవుట్ చేశాడు.
ఇక ఇన్నింగ్స్ అయిదవ ఓవర్ లో మనీష్ పాండే ను అవుట్ చేసి బ్యాక్ టు బ్యాక్ వికెట్లను సాధించి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇక ఈ ఇన్నింగ్స్ లో ఢిల్లీ కనీసం 100 పరుగులు అయినా చేస్తుందా సందేహమే.