ఏం చేయాల్నో నీకు నేను చెప్పాల్నా : మంత్రి కేటీఆర్‌

-

మంత్రి కేటీఆర్‌ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాఓ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన.. జిల్లాలోని ముస్తాబాద్‌ మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ను మహిళ రైతులు ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయామని..తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని లక్ష్మి అనే మహిళ రైతు కేటీఆర్ ను కోరింది. వెంటనే స్పందించిన మంత్రి.. తప్పకుండా కొంటామని మహిళా రైతు లక్ష్మిని భుజం తట్టి హామీ ఇచ్చారు. అయినా అట్లకాదు సర్ అని మహిళ రైతు మళ్ళీ చెప్పబోతుండగా..”ఏం చేయాల్నో నీకు నేను చెప్పాల్నా.. నేనేమన్న జేసిన తప్పు” అంటూ మంత్రి వెళ్లి పోయారు. రైతులు గొడు చెప్తుండగా పట్టించుకోకుండా వెళ్లిపోవడమేంటని స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మే 2వ తేదీ మంగళవారం మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం గోపాలపల్లిలో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. రైతులను ఓదార్చారు. అధైర్యపడొద్దని, కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు మంత్రి కేటీఆర్. 19వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఎకరానికి రూ.10వేల నష్ట పరిహారం అందిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news