ఐపిఎల్ 2023 ఫైనల్: లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో హీరోగా జడేజా…

-

ఐపిఎల్ ఫైనల్ లో మొదట టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ ఆరంభం నుండి దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. చివరికి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్ లలో 214 పరుగులు చేసి చెన్నై ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. కానీ చేజింగ్ లో మూడు బంతులు పడగానే మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత 15 ఓవర్ లకు మ్యాచ్ ను కుదించి చెన్నై కు 171 పరుగుల టార్గెట్ ను ఇచ్చారు. చివరి ఓవర్ వరకు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే మోహిత్ శర్మ వేసిన 18 వ ఓవర్ మాత్రం రెండు జట్లకు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ ఓవర్ కు ముందు మూడు ఓవర్ లకు 38 పరుగులు అవసరం. అప్పుడు క్రీజులో రాయుడు మరియు దుబే ఉన్నారు. స్ట్రైక్ లో రాయుడు ఉన్నాడు, బౌలింగ్ చేయడానికి మోహిత్ శర్మ రెఢీ గా ఉన్నాడు. వరుసగా మూడు బంతులను 6,6,4 లుగా మలిచి సమీకరనాన్ని ఒక్కసారిగా మార్చేశాడు. ఆ తర్వాత 15 బంతులకు 22 పరుగులు చేస్తే సరిపోతుంది.

కానీ ఆ తర్వాత 4వ బంతికే రాయుడు ను మరియు 5 వ బంతికి ధోనీని ఔట్ చేసి గుజరాత్ ను మళ్లీ మ్యాచ్ లోకి తెచ్చాడు. అప్పుడే ది హీరో ఆఫ్ ది మ్యాచ్ జడేజా క్రీజులో వచ్చాడు. ఆఖరి బంతి సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఓవర్ లో షమీ కేవలం కేవలం 8 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆఖరి ఓవర్ కు 13 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ ఓవర్ ను మళ్లీ మోహిత్ శర్మ వేయడానికి వచ్చాడు. మొదటి బంతిని డాట్ చేశాడు దుబే, రెండవ బంతికి సింగిల్, మూడవ బంతికి సింగిల్, నాలుగవ బంతికి సింగిల్, ఇక మిగిలిన రెండు బంతులకు 10 పరుగులు చేస్తే చెన్నై గెలుస్తుంది. స్ట్రైక్ లో జడేజా ఉన్నాడు, చెన్నై టీమ్ లో నెత్తుటి చుక్క లేదు, అభిమానులు కూడా ఏడుస్తూ ఉన్నారు. గుజరాత్ క్యాంప్ లో మాత్రం సంతోషం… కానీ అపుడే జడేజా మాజిక్ చేశాడు.. అయిదవ బంతిని స్ట్రెయిట్ గా సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని ఫోన్ లీగ్ దిశగా ఫోర్ గా మలిచాడు. అంతే… చెన్నై సూపర్ కింగ్స్ కు గొప్ప విజయాన్ని అందించింది హీరో ఆఫ్ ది చెన్నై మారాడు.

Read more RELATED
Recommended to you

Latest news