టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ కు భారీ టార్గెట్ ను నిర్దేశించింది. మొదటి రెండు ఓవర్ లలో ఆచితూచి ఆడిన ఢిల్లీ ఓపెనర్లు వార్నర్ మరియు పృథ్వీ షా ఆ తర్వాత గేర్ మార్చి మొదటి వికెట్ (వార్నర్ 46) కు కేవలం పది ఓవర్ ల రెండు బంతుల్లోనే 94 పరుగులు జతచేశారు. ఆ తర్వాత పృత్వి షా తో జత కలిసిన రాసౌ స్కోర్ బోర్డును జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించాడు. అనంతరం పృథ్వీ షా 54 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. రోసౌ మరియు సాల్ట్ లు మరో వికెట్ పడకుండా ఢిల్లీ కి 20 ఓవర్ లలో 213 పరుగులు చేసి పంజాబ్ ముందు గట్టి టార్గెట్ ను ఉంచారు.
ఇక ఈ భారీ లక్ష్యాన్ని పంజాబ్ చేధిస్తేనే ప్లే ఆఫ్ మీద ఆశలు పెట్టుకోవచ్చు, ఒకవేళ ఓడిందా ఇక ఎటువంటి సమీకరణాలు చూడకుండా.. ఇతర టీం ల ఫలితాలపై ఆధారపడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో కెప్టెన్ శిఖర్ ధావన్ అండగా నిలబడి పంజాబ్ కు విజయాన్ని అందించే బాధ్యతను తీసుకోవాలి. మరి చూద్దాం ఛేదనలో ఏమి జరగనుందో ?